Monday, November 10, 2008

జీవితం వెర్సస్ కీబోర్డు

అయిదు నిముషాల క్రితం, మీరు మీ బ్రాండ్ న్యూ కారు లో ఆఫీసు కి ఎనభయ్ కి.మీ స్పీడ్ లో వెళ్తున్నారు.
ఇప్పుడు అంతకు రెట్టింపు స్పీడ్ లో అంబులన్స్ లో హాస్పిటల్ కి వెళ్తుంటే అప్పుడు మీకు అనిపిస్తుంది జీవితం లో
'undo (ctrl + Z)' ఉంటే బాగుంటుంది అని.

మీరు ఆఫీసు కి లేట్ అయ్యారు. దానికి తోడు మీ డెస్క్ కీ కనిపించటం లేదు. అప్పుడు మీకు అనిపిస్తుంది జీవితం లో
'find tool (ctrl + F)'' ఉంటే బాగుంటుంది అని.


బాగా రద్దీగా ఉన్నా ట్రైన్ లో మీకు అటు వైపు చివర ఒక అందమయిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చేరుకోవటానికి వీలు కావటం లేదు. అప్పుడు మీకు అనిపిస్తుంది జీవితం లో 'zoom & view full screen' ఉంటే బాగుంటుంది అని.

పెళ్ళయిన తరువాత కొన్నాళ్ళకు మీరు మీకు తగని బంధం లో ఉన్నానని తెలుసు కుంటారు. అప్పుడు మీకు అనిపిస్తుంది జీవితం లో 'evaluation period' లేదా కనీసం 'sample download' లేదా 'demo version' అన్నా ఉంటే బాగుంటుంది అని.

ఏదో ఒక రోజు మీకు బట్ట తల వస్తోందని తెలుసు కుంటారు. అప్పుడు మీకు అనిపిస్తుంది జీవితం లో 'cut and paste (ctrl + X)/(ctrl + C)' ఉంటే బాగుంటుంది అని.

పైన రాసినవాటిలో ఏదో ఒకటి ఏదో ఒకప్పుడు జీవితం లో తారస పడితే అప్పుడనిపిస్తుంది 'ఆ రోజు రమేష్ చెప్తే నమ్మ లేదే అని'

5 comments:

Unknown said...

Nice jokes ramesh.Keep posting.We are waiting for next post

Unknown said...

miru rasina vatiki chala mandhi jivitam lo 'Select All' (Ctrl + A)
vuntundhi ani nenu anukuntunnanu

Unknown said...

Hi Ramesh, post chala bagundi, nenaite books lo particular topic search chese tappudu matram chala saarlu Ctrl+F gunrinchi alochinchanu.

Purnima said...

నేనూ అంతే పుస్తకాల్లో వెతకాలంటే Ctrl+F బాగుంటుందనిపిస్తుంది.

బాగా రాశారు. ఒక డిలీట్ బటన్, ఒక "బాక్ స్పేస్" బటన్ కూడా ఉంటే బాగుణ్ణనిపిస్తుంది.

Telugu Vilas said...

its a nice information blog
The one and the only news website portal Telugu vilas .
please visit our website for more news updates..
Telugu vilas